Devara is in Full Swing : స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు పెట్టుకొని ఇండస్ట్రీలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 18 ఏళ్ళ వయస్సులోనే ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడో తెలిసిందే. RRR మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. తారక్ తర్వాత చేయబోయే సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే RRR మూవీ కంప్లీట్ అయ్యాక తారక్ ఏడాది పాటు షూటింగ్స్ లేకుండా ఖాళీగానే ఉన్నాడు.
కొరటాల శివతో దేవర మూవీ మొదలు పెట్టడానికి చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్.. వన్స్ సెట్స్ మీదకు వెళ్ళగానే గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ విషయంలో డైరెక్టర్ కొరటాల, తారక్ ఇద్దరు ఫుల్ స్వింగ్ లో ఉన్నారని చెప్పవచ్చు. కేవలం 3 నెలల్లోనే 5 షెడ్యూల్స్ కంప్లీట్ చేయడం అంటే మాములు విషయం కాదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మీ స్పీడు కి హాట్స్ ఆఫ్, మీ హార్డ్ వర్క్, కమిట్మెంట్, డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ ఎగ్జైట్ అవుతున్నారు. ఏప్రిల్ 2024 లో బాక్సాఫీసు స్ట్రోమ్ గ్యారెంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కొరటాల ఫుల్ స్క్రిప్ట్ తో సెట్స్ మీదకి వెళ్లడంతోనే షూటింగ్ పక్కాగా సాధ్యమైందని అంటున్నారు. ఎన్టీఆర్ దేవరలో తన పార్ట్ ని ఈ ఏడాదిలోనే పూర్తిగా చేయాలని భావిస్తున్నాడు. మొత్తానికి దేవర యూనిట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ షెడ్యూల్ జులై మొదటివారంలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Discussion about this post