Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఇంతకు ముందు వీరి కాంబోలో అతడు, ఖలేజా వచ్చాయి. అయితే ఈ గుంటూరు కారం మూవీని మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుస్తున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

కొంత విరామం తర్వాత గుంటూరు కారం లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ కొంతమంది నటీనటుల విషయంలో కొంత మార్పు జరిగిన విషయం తెలిసిందే. మెయిన్ హీరోయిన్ పూజ హెగ్డే ప్లేస్ కి సెకండ్ హీరోయిన్ శ్రీలీల రాగా.. శ్రీలీల ప్లేస్ లో మీనాక్షిచౌదరిని ఫైనల్ చేశారు మేకర్స్. ఇదిలావుండగా తాజా సమాచారం ప్రకారం ఇందులో కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక క్యామియో రోల్ చేయనున్నారని తెలుస్తోంది.
ఇంకా ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతిబాబు క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తుండగా రమ్యకృష్ణ, రఘుబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, జయరాం తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.
