Payal Rajput : అందాల భామ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RX 100 సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమాలో ఈమె చాలా వైవిధ్యంగా బోల్డ్ గానూ ఉంది. ఇందులో ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కు లిప్ లాక్కులకు గ్లామర్ షోలకు కుర్రకారులో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
వరుస సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారింది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో కూడా నటించింది. వరుస ఛాన్సులు తలుపు తట్టినప్పటికీ..అవన్నీ కూడా పెద్దగా విజయాలు సాదించకపోయేసరికి అమ్మడికి ఛాన్సులు తగ్గాయి. తాజాగా ఈమె మాయాపేటిక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.