Allu Arjun Trivikram : సాధారణంగా కొన్ని మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్లు ఉంటాయి. అలాంటి కాంబినేషన్లలో సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో క్రేజ్ మామూలుగా ఉండదు. అలాంటి మోస్ట్ అవెయిటెడ్ కాంబోల్లో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్. ఈ ఇద్దరి కలయికలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంటపురం సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నాలుగో సినిమా చేయనున్నారు.

దీన్ని పాన్ ఇండియా స్థాయిలో గీతా ఆర్ట్స్, హారిక, హాసిని క్రియేషన్స్ తెరకెక్కించనున్నాయి. ఈ మేరకు మేకర్స్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు టాలీవుడ్ చిత్రాలే చేసిన త్రివిక్రమ్ మొదటిసారి బన్నీతో కలిసి పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు. ఇందుకోసం భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేశాడట గురూజీ.
ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉండగా.. అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ ఈ మూవీస్ కంప్లీట్ అయ్యాకే కొత్త సినిమా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే బన్నీ ఫ్యాన్స్, గురూజీ ఫ్యాన్స్ మాత్రం వీరి కాంబోలో రాబోయే 4వ మూవీ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
https://twitter.com/GeethaArts/status/1675725571849068544?t=DAVP6lFeUgFDMP8av9vJoQ&s=19
