Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడుగా పరిశ్రమలోకి వచ్చినా ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్. భిన్నమైన ఆలోచనా ధోరణి ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలున్నాయి. అతను సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. ఈ కారణంగానే అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఒకవైపు నటన చేస్తూనే.. దర్శకుడుగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం సముద్రఖని డైరెక్షన్ బ్రో, సుజీత్ ఓజి, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రెసెంట్ ఈ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అభిమానులతో ట్విట్టర్, ఫేస్ బుక్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాడు.
ఇక నుంచి పవన్ త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా రాబోతున్నట్లు ఆయన సోదరుడు కొణిదెల నాగబాబు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ డెబ్యూ డేట్ ఇంకా వెల్లడి కాలేదు. అలాగే భీమ్లా నాయక్ తర్వాత చాన్నాళ్ళకి పవన్ బ్రో మూవీ రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.