Niharika-Chaitanya Divorce: మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక విడాకుల విషయం గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఈ ఇష్యూపై ఓ క్లారిటీ వచ్చేసింది. నిహారిక తన భర్తతో విడిపోవడం నిజమేనని అధికారిక సమాచారం వచ్చేసింది. పరస్పర అంగీకారంతో హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ కోసం దరఖాస్తు చేసుకోగా.. జూన్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. విడాకులకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను ఇటీవలే కోర్టు నుంచి పొందారు.
అయితే వీరద్దరిలో ఎవరు ముందుగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు? అని నెటిజన్లు సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డల విడాకులకు సంబంధించిన ఓ కాపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ముందుగా పిటిషన్ దాఖలు చేసింది చైతన్యనే అని ఉంది. అనంతరం నిహారిక పిటిషన్ వేశారు. నిహారిక తరుపున విడాకుల కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర అని తెలుస్తోంది.
అతను నాగబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి అందుకే ఈ విషయం ఇంతవరకు బయటకు రాలేదు. నిహారిక చైతన్యల వివాహం 2020 డిసెంబరులో రాజస్థాన్‌లో వైభవంగా జరిగింది. పెళ్లైన కొంత కాలానికే మనస్ఫర్థలు రావటంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వివాహం అనంతరం సినిమాలకు కొంత కాలంగా దూరంగా ఉన్న నిహారిక ఇటీవల ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.