Lotus Seeds : ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటేనే ప్రశాంతమైన జీవితాన్ని గడపగలం. అలాంటి ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఈ రోజుల్లో జబ్బులు అనేవి అధికంగా ప్రబలుతున్నాయి. అలాంటి వాటిని అరికట్టాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో మార్పులు, చేర్పులు చేయవలసి ఉంటుంది.
బలమైన పౌష్టికాహారం తీసుకున్నప్పుడే మన లోపల రోగనిరోధక శక్తి పెరిగి వచ్చినటువంటి జబ్బులను శక్తివంతంగా ఎదుర్కోగలుగుతాం. ఈరోజుల్లో అధిక బరువు సమస్య అందరిని చాలా బాధపెడుతుంది. దానికోసం చక్కటి పరిష్కారం తామరగింజల్లో దొరుకుతుంది. శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే తామర గింజల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తామరు గింజల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్ల లాంటి చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. తామర గింజలు ప్రతిరోజు తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడమే కాక సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని న్యూట్రిషియనిస్ట్ లు చెబుతున్నారు. తామర గింజల్లో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగానే ఉంటుంది. అలాగే తామర గింజల్లో క్యాలరీలు చాలా ,చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.
తామర గింజల్లో ఉండే పోషకాలు అధిక బరువును తగ్గించడంలో దోహదపడతాయి. ఈ నట్స్ తినాలని న్యూట్రిషియనిస్ట్ లు, జిమ్ ట్రైనర్లు కూడా సూచిస్తూ ఉంటారు. తామర గింజలు తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండా తామర గింజలు అడ్డుకుంటాయి. వీటిల్లో ఉన్న కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇంకా ఫాస్ఫరస్ తోపాటు, సూక్ష్మ పోషకాలు కూడా ఈ గింజల్లో అధికంగా లభిస్తాయి. తామర గింజలు ఒత్తిడిని నిరోధించడంలో బాగా సహాయపడతాయి.
తామర గింజల్లో ఉండేటటువంటి గల్లీక్ యాసిడ్, క్లోరోజేనిక్ యాసిడ్, ఎఫికాటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు, గుండె జబ్బులు క్యాన్సర్, టైప్2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడమే కాక, ఎముకలకు క్యాల్షియం అందించి ఆరోగ్యాన్ని అందిస్తాయి. రక్తపోటును తగ్గించి కొలెస్ట్రాల్ నీ అదుపులో ఉంచడానికి తామర గింజలు చాలా బాగా పనిచేస్తాయి.