Bigg Boss 7 Telugu : టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతుంది బిగ్ బాస్. ఇలాంటి షోలు మొదట విదేశాల్లో ఉండేవి అక్కడ సూపర్ హిట్ కావడంతో ఇండియాలో ప్రారంభించారు. మొదట నార్త్ లో ఈ షోని ప్రారంభించారు. అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించడంతో అన్నీ దక్షిణాది రాష్ట్రాల్లో బిగ్ బాస్ ని ప్రారంభించారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ 6 సీజన్ల ను పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా నటుడు శివ బాలాజీ విజేతగా నిలిచాడు.
ఆ మధ్య ఓటీటీ వెర్షన్ ను కూడా ప్రారంభించారు “బిగ్ బాస్ నాన్ స్టాప్” పేరుతో 24 గంటల పాటు ఈ షోని టెలికాస్ట్ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ షో సక్సెస్ కాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. ఈ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా ఉండే అవకాశం ఉంది. సీజన్ 7కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా.. ఫైనల్ గా ఓ అప్డేట్ ని ఇచ్చారు ‘స్టార్ మా’ వారు.
Rashmi Gautam Tweet : రేపిస్ట్ నుంచి కాపాడండి..
అతి త్వరలోనే బిగ్ బాస్ 7 ప్రారంభం కానుందని ఓ సరికొత్త ప్రోమోతో అలాగే బ్రాండ్ న్యూ లోగోని డిజైన్ చేసి టీవిలో ప్రసారం చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. బిగ్ బాస్ 6 అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో కంటెస్టెంట్స్‌ని ఈసారి మరీ నాసిరకంగా యూట్యూబ్, సోషల్ మీడియా బ్యాచ్‌లనే కాకుండా.. కాస్త పేరున్న సెలబ్రిటీలను రంగంలోకి దించబోతున్నారని తెలుస్తుంది. ఈ సీజన్ ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.