Fasting Diet : మన భారతదేశంలో ఉపవాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. పండుగలప్పుడు ఇష్టదైవానికి ప్రార్థిస్తూ.. ప్రతి ఒక్క దేవుడికి ఒక రోజును కేటాయించి, భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. అలాంటి ఉపవాసం ఉన్నప్పుడు.. ఉపవాస దీక్ష పూర్తయిన తర్వాత.. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఉపవాసం ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా తెలీసుకుందాం. అందరి ఆరోగ్యం ఒకే తీరుగా ఉండదు. కొందరు అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు.
కానీ అలాంటి వారు కూడా ఉపవాసం ఉండాలని అనుకుంటారు. అలాంటి వారు ఉపవాసం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల విషయంలో, పానీయాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అప్పుడే వారు ఉపవాసం ఉన్నా కూడా ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం జరగదు. ఉపవాసం చేస్తున్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే తిరిగి శక్తిని పొందవచ్చు.ఎటువంటి ఆహారంలో సరైన పోషకాలు శరీరానికి అందుతాయో తెలుసుకుందాం.
ఖర్జూరం : తరచూ ఉపవాసం చేసేవారు తమ ఆహార పదార్థాల్లో ఖర్జూరాన్ని చేర్చుకోవాలి. ఖర్జూరం మన రక్తంలోనీ చక్కర స్థాయి నీ నియంత్రణలో ఉంచడమే కాకుండా, మన శరీరానికి అధిక మోతాదులో శక్తిని కూడా అందిస్తుంది.
గింజలు : ఉపవాస సమయంలో విటమిన్లు, ఖనిజాలు అధిక మోతాదులో ఉండే వాల్ నట్స్, పిస్తా వంటివి తీసుకోవడం చాలా మంచిది. వీటివల్ల శరీరానికి శక్తి అందడమే కాకుండా, ఉపవాసం వల్ల నీరసం దరిచేరదు.
పెరుగు : పెరుగు ఉపవాస సమయంలో మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు పెరుగును తీసుకోవడం వల్ల జీవక్రియ సరిగ్గా పనిచేయడమే కాకుండా పెరుగు శరీరాన్ని హైడ్రేట్ కాకుండా చూసుకోవడంలో సహాయం చేస్తుంది. అలాగే ఉపవాస సమయంలో రోగనిరోధక శక్తిని పెరుగు పెంచుతుంది.
పండ్లు : ఉపవాసం ఉన్నప్పుడు తాజా పండ్లను ఖచ్చితంగా తినాలి. తాజా పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరానికి శక్తిని అందజేసి, మీ శరీరం హైడ్రేట్ కాకుండా కాపాడతాయి.