తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు తెరదించేందుకు కేంద్రం ప్రతిపాదించిన అపెక్స్ కమిటీ భేటీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25వ తేదీన జరగాల్సి ఉంది. కానీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి కోవిడ్ సోకడం వలన సమావేశం వాయిదా వేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ రహస్య మిత్రులైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందాలు కాకుండా జల వివాదాలను పరిష్కరించుకోవాలని, నీటి పంపకాలపై కేంద్ర ప్రభుత్వంపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. గవర్నర్ పై టిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదని, పూర్తి స్థాయిలో టెస్టులు లేకపోవడం వల్ల కరోనా మరింత విజృంభిస్తుందని, తెలంగాణలో టెస్టులు సంఖ్య మరింత పెంచాలని డిమాండ్ చేశారు.