Tomato Magic : ఇప్పుడు మార్కెట్లో టమాట రాజ్యమేలుతోంది.. టమాటా ఏ ఇంట్లో ఉంటే వాళ్ళు ధనవంతులు అన్నట్టుగా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి.. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాట ధర ఏకంగా 250 రూపాయలు పలుకుతుంది. రానున్న రోజులల్లో ఇంకా 300 రూపాయల వరకు టమాటా ధర పెరగవచ్చని ఒక అంచనా వేస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే ఈ సంవత్సరం టమాటలు పండించిన రైతులకు కాస్త లాభసాటిగానే ఉందని చెప్పవచ్చు. దానికి ఉదాహరణ ఒక రైతు రాత్రికి, రాత్రే టమాట వల్ల కోటీశ్వరుడు అయిపోయాడు.
తుకారం బాగోజి అనే రైతు మహారాష్ట్ర పూణే జిల్లాకు చెందిన వాడు. ఈ రైతు యొక్క కుటుంబం 20 సంవత్సరాలుగా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. వారు ఎక్కువగా ఏ సీజన్ కు సంబంధించిన పంటలను ఆ సీజన్లో పండిస్తూ వ్యవసాయం ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం 12 ఎకరాల్లో టమాటా పంట సాగు చేశారు. నెల రోజులుగా పంట చేతికి వస్తున్న 12 ఎకరాల్లో 13వేల బాక్స్ ల టమాట దిగుబడి వచ్చింది.

ఒక్కో బాక్స్‌లో 20 కిలోల టమాటా ప్రకారం నిర్ణయిస్తారు. మొత్తం 13 డబ్బాల టమాటాను విడతలవారిగా వారు విక్రయించారు. తుకారం కోడలు సారిక ఆధ్వర్యంలో నారాయణగంజ్ మార్కెట్లో ఈ టమాటాలను వారు విక్రయించారు. తుకారం పండించిన టమాటా మంచి నాణ్యత కలిగి ఉండటంతో మార్కెట్లో 80 నుండి 125 రూపాయలకు కిలో చొప్పున అమ్ముడుపోయింది. జులై 14వ తేదీ ఒక రోజులోనే ఏకంగా 900 బాక్సులను వీరు అమ్మారు.
దాంతో వీరికి 18 లక్షల రూపాయలు లాభం వచ్చింది. అదేవిధంగా 2500 బాక్సులను 100 రూపాయల చొప్పున విక్రయించింది తుకారం కుటుంబం. 80 రూపాయలకు కిలో చొప్పున 6000 డబ్బాలను ఇలా నెలరోజుల్లో 13000 బాక్సులను అమ్మగా కోటి యాభై లక్షల రూపాయలు వీళ్లు ఆర్జించారు. టమాటా పంట మంచి గిట్టుబాటు పలకడంతో తుకారం కుటుంబం సంతోషంలో మునిగి తేలుతుంది.
20 ఏళ్లుగా తాము అనుభవించిన దరిద్రం ఈ సంవత్సరం టమాట పంటతో పోయిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతిసారి టమాటా పంటని పండిస్తామని ఎప్పుడూ కూడా ఇంత లాభం రాలేదని ఈ సంవత్సరం ధర బాగుండడంతో పంట కూడా బాగా పండడంతో నెల రోజుల్లోనే కోటీ 50 లక్షల రూపాయలు సంపాదించామని, ఇంకా తోటలో కొంత పంట మిగిలి ఉంది. ధర ఇలాగే ఉంటే ఇంకో 15 రోజులలో మరో 50 లక్షలు సంపాదిస్తామని తుకారం ఫ్యామిలీ ఆనందంగా చెబుతున్నారు.
