Sitara Ghattamaneni : తాజాగా సితార తొలి కమర్షియల్ యాడ్ లో మెరిసింది. పీఎంజే జూవెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సీతూ పాప.. తొలి కమర్షియల్ యాడ్ ను సితార కలెక్షన్స్ పేరుతో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ పై ఆవిష్కరించారు. ప్రముఖ నటుడు మహేశ్ బాబు ముద్దుల తనయ సితార టీనేజ్ లోనే రికార్డు సృష్టించింది. మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతుల కుమార్తె సితార చిన్న వయసులోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుందని చెప్పుకోవాలి.

డ్యాన్స్ వీడియోలతో, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ, ఎక్కువ మంది తనను అనుసరించేలా చేసుకుంటోంది. ఇప్పుడు ప్రముఖ జ్యుయలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా మారిపోయింది. పీఎంజే జ్యుయలరీ సితారను తన ప్రచారకర్తగా నియమించుకుంది. సితారతో ఇటీవలే ఓ ప్రచార చిత్రాన్ని కూడా షూట్ చేశారు. రానున్న రోజుల్లో సితారతో రూపొందించిన ప్రకటన మనకు టీవీల్లో కనిపించనుంది.
Singer Chinmayi : తమిళనాడు సీఎం స్టాలిన్ పై సింగర్ చిన్మయి ఫైర్..
పీఎంజే జూవెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సీతూ పాప.. తొలి కమర్షియల్ యాడ్ ను సితార కలెక్షన్స్ పేరుతో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ పై ఆవిష్కరించారు. ఈ డీల్ తో చిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయ అని సితార మరోసారి నిరూపించుకుంది. మహేశ్ బాబు సైతం బాల నటుడిగా అదరగొట్టడం గుర్తుండే ఉంటుంది.
