Naga Chaitanya : అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగ చైతన్య. హిట్లు, ప్లాప్ లు అని చూడకుండా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. నాగ చైతన్య గత కొంతకాలంగా సినిమాల్లో వేగం పెంచాడు. చైతూ ఇటీవల చేసిన కస్టడీ నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ మంది హీరోలు ఒకేసారి రెండు సినిమాలు చేస్తుంటారు. అయితే చైతూ మాత్రం ఇప్పటి వరకు ఒక మూవీ మాత్రమే చేస్తూ వచ్చాడు. ఒక మూవీ కంప్లీట్ అయ్యాకే ఇంకో మూవీ పట్టాలెక్కించే వాడు.
కానీ ఇప్పుడు చైతూ కూడా రూటు మార్చినట్టున్నాడు. ఒకేసారి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే కార్తికేయ-2 దర్శకుడు చందూ మొండేటితో గీతా ఆర్ట్స్ బేనర్లో ఒక సినిమా ఓకే చేశాడు చైతూ. ఇందులో చైతూ జాలరి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే మరో మూవీ అప్డేట్ వచ్చింది. శివ నిర్వాణ డైరెక్షన్ లో మరో మూవీ చేయనున్నట్టు తెలుస్తుంది.
Vijay Sethupathi : ఆ మూవీకి రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా నటించేవాడిని..
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత తో ఖుషి చేస్తున్న శివ.. చైతూకి మరో లవ్ స్టొరీ చెప్పి ఒప్పించాడట. ఖుషి రిలీజ్ తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే చందూ మొండేటి మూవీ ఆగిపోయిందేమో అని భావించారంతా కానీ రెండు ఒకేసారి చేసే ఆలోచనలో ఉన్నాడట చైతూ. ఒకవేళ అలా చేస్తే.. లుక్ పరంగా వెరియేషన్ ఎలా మైంటైన్ చేస్తాడో చూడాలి. అసలే అక్కినేని ఫ్యాన్స్ ఆకలి మీదున్నారు ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ అన్నట్టూ.. చూడాలి చైతూ అయినా అభిమానుల కోరిక నెరవేరుస్తాడేమో..
Sai Dharam Tej : పవన్ మావయ్య వల్ల నా పెళ్లి కాకుండా పోయింది..