Vaishnavi Chaitanya : ప్రస్తుతం టాలీవుడ్ యూత్ జపిస్తున్న మంత్రం వైష్ణవి చైతన్య. తాజాగా విడుదలైన బేబి సినిమాలో తన పర్‌ఫార్మెన్స్‌తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు వైష్ణవి క్యారెక్టర్‌ను బండ బూతులు తిడుతున్నారంటే.. నెగెటివ్ క్యారెక్టర్‌లో ఏ లెవల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోయిన్‌గా మొదటి సినిమాలోనే ఈ రేంజ్‌లో తన నటనతో వావ్ అనిపించిందని..

భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. చెప్పాలంటే బేబి సినిమాకు వచ్చిన ఈ క్రేజ్ అంతా వైష్ణవి వల్లే, ఈ సినిమాను తన భుజాలపై మోసిందనే వారు లేకపోలేదు. సోషల్ మీడియాలో వైష్ణవికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన పాటలతో పాటు, టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ హైదరాబాదీ.
Anasuya Bharadwaj Hot Pics : అనసూయ లేటెస్ట్ హాట్ పిక్స్..
ఆమె నటనకు పలువు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఉస్తాద్ రామ్ పోతినేని వైష్ణవికి స్పెషల్ బొకే గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని వైష్ణవి తన ట్విట్టర్ వేదికగా తెలిపింది. “పువ్వులు పంపినందు ధన్యవాదాలు రామ్ గారూ అలాగే నాకు, బేబి టీంకు శుభాకాంక్షలు తెలిపినందుకు” అంటూ రాసుకొచ్చింది.
https://twitter.com/iamvaishnavi04/status/1683819504844029952?t=vfpM6vtWacTR2rIwVdLYnw&s=19