Nadendla Manohar – YCP : వైసిపి ప్రభుత్వం పథకాల పేరు తోటి గిరిజన పుత్రులను కూడా మోసం చేస్తుందని నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. గిరి పుత్రులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారి పట్ల ఖఠినంగా వ్యవహరిస్తుందని ఆయన వెల్లడించారు. వైసిపి ప్రభుత్వ హాయంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఏ ఒక్కరిని కదిలించిన సమస్యలతోనే వారు సతమతమవుతున్నారని నాదెండ్ల తెలిపారు.
పార్టీలో చేరిన మాజీ జడ్పీటీసీ, గిరిజన నేత నిమ్మల నిబ్రం గిరిజన ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. గిరిపుత్రుల ఉన్నతి కోసం ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు పూర్తిగా విస్మరించిందన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యులు, గిరిజన నాయకులు నిమ్మల నిబ్రం తన అనుచరులతో కలసి జనసేన పార్టీలో చేరారు.

నాదెండ్ల మనోహర్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పాలకుల దాష్టికాలపై పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యూనివర్సిటీతో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటు, వంశధార ప్రాజెక్టు పెండింగ్ పనులు, ఇటీవల కాలంలో పాలకొండ ప్రాంతంలో చోటు చేసుకున్న వాలంటీర్ల దాష్టికాలను పార్టీ శ్రేణులు మనోహర్ గారికి వివరించారు.
జగన్ ఆగడాలను అరికట్టాలంటే అవినీతిని ఆపాలంటే అది కేవలం ఒక జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని నాదెండ్ల తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ఇలాంటి అక్రమాలు ఆగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే జనసేన పార్టీ లక్ష్యంగా అందరం ముందుకు కదలాలని నాదెండ్ల పిలుపునిచ్చారు.
