Small Grains are Children : మనకంటే ముందు తరాల వాళ్ళు బియ్యానికి బదులుగా ముఖ్య ఆహార పదార్ధంగా చిరుధాన్యాలని వాడేవారు. కాలం మారుతున్న కొద్ది ఆహార పదార్థాల వాడకంలో కూడా మార్పు వచ్చింది. ఇప్పటి జనరేషన్ కి ఎక్కువగా చిరుధాన్యాలు అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి. సమృద్ధిగా శరీరానికి బలాన్ని ఇచ్చే ఆహారాన్ని ఆపివేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఇప్పటి తరం ఎదుర్కొంటున్నారు.
అయితే చిరుధాన్యాలు పెద్దవారు మాత్రమే తినాలా…లేకపోతే చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చా.. అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇప్పటి తరం పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ లాంటి వాటికి అలవాటు పడ్డారు. ఈ తరం పిల్లలు పండ్లు, పౌష్టిక ఆహారం లాంటివి కూడా తీసుకోరు. ఆహారం విషయంలో వాళ్ళు చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు ఆరోగ్యంగా లేకపోతే భవిష్యత్తులో వారు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి తల్లిదండ్రులు వారి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. మరీ పిల్లలకు చిరుధాన్యాల వల్ల ఎటువంటి పోషకాలు అందుతాయో తెలుసుకుందాం. చిరుధాన్యాలు పిల్లలకు చాలా అద్భుతమైన ఆరోగ్య ఫలితాలను అందిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఎటువంటి సందేహం లేకుండా చిరుధాన్యాలు పిల్లలకు పెట్టవచ్చని వారు తెలియజేస్తున్నారు.
చిరుధాన్యాలు పిల్లలకు నేరుగా కాకుండా వాటిని ఆరు గంటలు నానబెట్టి తర్వాత వడగట్టి మరో నాలుగు గంటలు బుట్టలో నానబెట్టాలి. అలా మొలక వచ్చిన చిరుధాన్యాల ను నీడలో పూర్తిగా ఆరనివ్వాలి. ఆ మొలకొచ్చిన చిరుధాన్యాలను సన్నని వేడి పై లైట్ గా వేయించి, వాటిని పొడి చేసుకోవాలి. ఆ పొడిని పిల్లలకు ప్రతిరోజు పాలలో కలిపి ఇవ్వడం ద్వారా పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చిరుధాన్యాలను పిల్లలకు అలవాటు చేసి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి.