Depression : ఈ రోజుల్లో చాలామంది డిప్రెషన్ కి గురవుతున్నారు. చిన్న,చిన్న కారణాలను పెద్దవిగా ఆలోచిస్తూ, జీవితంలో వచ్చేటటువంటి సమస్యలను తట్టుకోలేక డిప్రెషన్ కి లోనవుతున్నారు. దాన్ని తగ్గించుకోవడం కోసం మందులను వాడుతూ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ని అనుభవిస్తున్నారు. డిప్రెషన్ మందులతో కాకుండా మనం రోజువారి తీసుకుని ఆహారంతో ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ప్రతిరోజు పని ఒత్తిడి వల్ల చాలామంది వ్యాయామాన్ని చేయరు. వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరానికి ఒక విధమైన నష్టమే అని చెప్పాలి. మన ఉరుకుల, పరుగుల జీవితంలో వ్యాయామం కోసం ఒక గంట సమయాన్ని కేటాయించాలి. వ్యాయామం ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అలాగే వ్యాయామం చేయడం వల్ల డిప్రెషన్ నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. వ్యాయామంతో పాటు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేయవలసి ఉంటుంది. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.
గుడ్డు : గుడ్డులో అనేక రకాల గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా గుడ్డులో బి 12 పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల మన శరీరానికి, మెదడుకు కలిగేటటువంటి ఒత్తిడి, డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో గుడ్డును చేర్చుకోవడం ఉత్తమం.
వాల్నట్స్ : వాల్ నట్స్ డిప్రెషన్ తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని రోజూ తీసుకోవడం మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. మన మెదడుకు ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక మెదడు చురుగ్గా పనిచేయడంలో కూడా తమ వంతు సహాయం చేస్తాయి.
ఆకుకూరలు : తాజాగా ఉండే ఆకుకూరలు డిప్రెషన్ తగ్గించడంలో తమ వంతు బాధ్యత పోషిస్తాయి. ఆకుకూరలు రోజు తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సజావుగా జరిగి మెదడు చురుకుగా పనిచేస్తుంది.
ద్రాక్ష : ద్రాక్ష మనలో ఉన్నటువంటి ఒత్తిడిని డిప్రెషన్ ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. రోజువారి ఆహారంలో ద్రాక్ష ను చేర్చడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.
బాదం : ప్రతిరోజు గుప్పెడు బాదంపప్పులను తీసుకొని నీళ్లలో నానబెట్టి వాటి పొట్టును తినడం వల్ల డిప్రెషన్ తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా చేకూరుతుంది. బాదాంతో పాటు జీడిపప్పు కూడా డిప్రెషన్ తగ్గించడంలో దోహదపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.