Pawan Kalyan : మీ వాలంటీర్లు తప్పులు చేస్తే అధికార పార్టీ నాయకులు పరామర్శకు కూడా రారా.. తప్పు ఎవరు చేసినా తప్పే.. బాధ్యతగా వచ్చి పరామర్శించి భరోసా ఇవ్వకపోతే ఎలా? అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. పోలీసు వెరిఫికేషన్ లేదు.. సర్టిఫికెట్లు తీసుకున్నారో లేదో తెలియదు.. వాలంటీర్ల పేరిట సమాంతర వ్యవస్థ తీసుకువచ్చి ఈ ప్రభుత్వం నేరుగా ఇళ్లలోకి పంపివేసిందన్నారు.
ఇంట్లో ఏ సమయంలో ఎవరెవరు ఉంటారు? ఎవరు ఎక్కడ ఉద్యోగం చేస్తారు? అన్న సమాచారం మొత్తం వారికి తెలిసిపోవడమే ఇలాంటి సంఘటనలకు కారణం అన్నారు. ఇళ్లలో ఉండే పెద్దల వివరాలు తెలుసుకుని కరడుగట్టిన నేరాలకు పాల్పడే. దండుపాళ్యం బ్యాచ్ కి వీళ్లకి తేడా ఏముందని ప్రశ్నించారు. శనివారం ఇటీవల విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు శ్రీమతి కోటగిరి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులను పార్టీ పీఏసీ
చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ నేతలతో కలసి వెళ్లి పరామర్శించారు. శ్రీమతి వరలక్ష్మి గారి భర్త గోపాలకృష్ణ, కుమారుడు వెంకటేష్ లతో పాటు కుమార్తెను పరామర్శించారు, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. వాలంటీర్ల వద్ద ప్రతి ఇంటి సమాచారం ఉంటుంది. ప్రతి ఒక్కరి వివరాలు ఉంటున్నాయి. ఎవరు ఏం చేస్తారు? ఏ సమయంలో ఎవరు ఇంట్లో ఉంటారు? అన్న వివరాలు వాలంటీర్ ముసుగులో సులువుగా తెలుసుకోగలుగుతున్నారు.
ఇటీవల మారేడుమిల్లి ప్రాంతంలో తాటి కుండల్లో విషం కలిపిశాడు ఓ వాలంటీర్. సమాంతర వ్యవస్థలే ఇలాంటి దారుణాలకు కారణం. పోలీసుల శాఖకు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసే వరకు విషయం తెలియదు. బెదిరింపులు, గొలుసులు తెంచుకుకోవడాలు లాంటి సంఘటనలు పెరిగాయి. ఇలాంటి నేరాలు గతంలోనూ, ఉన్నాయి. అయితే వాలంటీర్లకు ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేశారు.
కానిస్టేబుల్ ఉద్యోగానికి సర్టిఫికెట్లు కావాలి. వాలంటీర్ వ్యవస్థకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉందో తెలియదు. చిన్న పరీక్ష రాయించి ఉద్యోగాలు ఇచ్చేశారు. చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం ఇవాలన్నా అన్ని వివరాలు తెలుసుకుని గాని ఇవ్వం. నేరుగా ఇళ్లలోకి పంపినప్పుడు కనీసం పోలీసు ఎంక్వయిరీ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? వైసీపీ కార్యకర్త అయితే చాలు అన్నట్టు ఉద్యోగాలు ఇచ్చేశారు అన్నారు.