Pawan Kalyan – Jagan : జగన్ అనే వ్యక్తికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏం పట్టదు. ఆంధ్రప్రదేశ్ డేవలప్ మెంటు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ ఇష్టానుసారం అప్పులు చేస్తున్నారు. రూ.25 వేల కోట్ల అప్పులు తెచ్చాడు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రభుత్వ భూముల దోపిడీ భారీగా జరుగుతోంది, ఎయిడెడ్ పాఠశాలల ఆస్తులను దోచుకోవడానికి పన్నాగం పన్నారు. ఉత్తరాంధ్రకు సిరులు నింపి సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు లేదు. వైసీపీ ప్రభుత్వ వచ్చాక రూపాయి పెట్టుబడి లేదు.
విశాఖ నీటి అవసరాలు తీర్చలేదు. విశాఖలో దసపల్లా, సిరిపురం, రుషికొండ లాంటి విలువైన భూములను కళ్లెదుటే దోచేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని విలువైన భూముల మీద వైసీపీ కన్ను పడింది. మొదటిగా విశాఖను దోచుకొని తర్వాత మిగిలిన ప్రాంతాలను దోచేస్తారు. ఉత్తరాంధ్రలో కీలకమైన బీసీ కులాలను తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగిస్తే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కనీసం మాట్లాడలేకపోయిన జగన్ ఉత్తరాంధ్ర మీద చూపిస్తున్న కపట ప్రేమను ప్రజలు అర్ధం చేసుకోండి..
తెలంగాణలోని జగన్ కు ఉన్న రూ.300 కోట్ల సొంత ఆస్తుల రక్షించుకోవడం కోసం, రెండు రాష్ట్రాల మధ్య మిగిలిపోయిన రూ.లక్ష కోట్ల ఆస్తుల పంపకాన్ని కనీసం అడగని వ్యక్తి జగన్. నేను ఏమైనా మాట్లాడితే నా మీద నోరు వేసుకొని పడిపోవడం వైసీపీ నేతలకు తెలుసు. నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని, నా తల్లిని, పిల్లలను తిట్టించినా భయపడి పారిపోయేవాడిని కాదు. ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో, ప్రజాక్షేత్రంలో మీ అసలు రంగు బయటపెట్టడంలో నేను మొండివాడిని. దీనికి అసలు తలవంచేవాడిని కాదు.
విశాఖను నా రెండో ఇంటిగా చేసుకుంటాను. విశాఖపట్నం వేదికగా వైసీపీ చేస్తున్న అక్షమాలు చూస్తుంటే భయంగా ఉంది. నేను ఇప్పటికీ రాష్ట్రంలోనే ఉండాలని, ప్రజల్లోని పారినే నివాస ప్రాంతంగా చేసుకున్నాను. ఇక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు, ప్రజలతో ఉండి నిరంతరం విశాఖ అక్రమాలపై చైతన్యం నింపిందుకు విశాఖను నా రెండో ఇంటిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సిరిపురం జంక్షన్ సాంఘిక సంక్షేమ వసతిగృహం తాలుకా భూములపై వైసీపీ కన్ను పడితే దాన్ని బలంగా జనసేనా పార్టీ నాయకులు అడ్డుకున్నాడు. టీడీఆర్ బాండ్ల పంపిణీలోనూ అంతులేని అవినీతి జరుగుతోంది. పెద్ద జులరి పేటలో రూ.2 వేల కోట్ల టీడీఆర్ బాండ్ల అవినీతి లొసుగులు జరుగుతున్నాయి. దీనిపైనా స్పందించాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.