Mental Health : మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే ఆ మనిషి చాలా రకాల సమస్యలను చవి చూడవలసి ఉంటుంది. మానసిక సమస్యలు అనేవి ఒత్తిడి కారణంగానే ఎక్కువగా వస్తుంటాయి. మనిషి యొక్క రోజువారి జీవనంలో ఎన్నో ఒత్తిడి లతో సాగుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడి తీవ్ర పరిణామాన్ని మనిషి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి నుండి బయట పడాలి అంటే ఎటువంటి ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలో తెలుసుకుందాం..
మనం రోజువారి ఆహారంలో తీసుకుని పదార్థాలను బట్టి బ్రెయిన్ యొక్క పనితనం కూడా బాగుంటుంది. వాటి ద్వారానే మనిషి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఏ ఆహార పదార్థాలు లు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి
మనకు పోషకాలు ఎక్కువగా ఆకుకూరల్లో లభ్యం అవుతూ ఉంటాయి. ఆకుకూరలను కనుక మన రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మానసిక సమస్యలు దూరం అవడమే కాక మన శరీరాన్ని కావలసిన పోషకాలు కూడా అంది. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా ఆకుకూరల్లో మెంతికూర, తోటకూర, పాలకూర తినాలి అదేవిధంగా పండ్లలో బెర్రీస్ ను తీసుకుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. తాజా పండ్లు బెర్రీస్ వంటివి డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తాయి. అలాగే చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా మానసిక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. నట్స్ తినడం వల్ల సమస్య నుంచి దూరం కావచ్చు. వాల్ నట్స్, బాదం లాంటివీ కూడా ఈ సమస్య నుంచి మనల్ని కాపాడతాయి.