Devara – Umar Sandu : RRR మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ దేవరతో మరోసారి ఫ్యాన్స్ ని కనువిందు చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఇప్పటికే దేవర షూటింగ్ శరవేగంగా సాగుతూ చెప్పిన తేదీకి విడుదల చేయాలని ఉత్సాహంతో మేకర్స్ అందరూ నిరవధికంగా పనిచేస్తూ 2024 ఏప్రిల్ 5న ఎలాగైనా దేవర రిలీజ్ చేయాలని ఆరాటపడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో చాలా బిజీగా ఉంటూ తాత ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం లాంచింగ్ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదంటే షూటింగ్ ఎంత శరవేగంగా సాగుతుందో మనం ఊహించవచ్చు. దర్శకుడు కొరటాల శివ భారీ బడ్జెట్ తో దేవరను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ ఈ చిత్రం కోసం కేటాయించినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఫిలిం క్రిటిక్ ఉమర్ సందు దేవర మూవీ గురించి అదిరిపోయే మాట చెబుతూ ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచాడు.

పది సెకండ్స్ రష్ చూశాను, నా మైండ్ బ్లాక్ అయ్యింది. ఎన్టీఆర్ లుక్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఈ ఎపిక్ సాగా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను, అని ట్వీట్ చేశాడు. ఉమర్ సందు నోటా ఎప్పుడు కూడా పాజిటివ్ టాక్ రాదు.. ఆయన ఎప్పుడూ హీరో, హీరోయిన్స్ పైనా రూమర్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తూ ఉంటాడు. అలాంటి ఉమర్ సందు దేవర మూవీ గురించి పాజిటివ్ టాక్ చేయడం అందరికి ఆ మూవీ పైన అంచనాలను పెంచేస్తుంది.
ఉమర్ సందు వ్యాఖ్యలు ఎలా ఉంటాయంటే ఇదివరకు ఊర్వశి రాతెలా, పూజా హెగ్డేల మీద కూడా ఉమర్ సంధు అనుచిత కామెంట్స్ చేయగా వారు చట్టపరమైన చర్యలకు పాల్పడ్డారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా జాన్వికపూర్ నటించే విషయం తెలిసిందే.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తుండగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఆచార్య మూవీతో చాలా విమర్శలపాలైనటువంటి కోరాటాల శివ ఎలాగైనా దేవరతో హిట్ కొట్టాలని సినిమాను నిర్మిస్తున్నారు. చూడాలి ఇంతమందిలో హైప్స్ క్రియేట్ చేస్తున్న దేవర ఎలా ఉంటుందో..
