సొమ్మొకడిది సోకొకడిది అనే రీతిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన నిర్మాణాలను తమ ఖాతాలో వేసుకోవడం రాష్ట్ర నేతల అలవాటు. కానీ ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు మా దగ్గర ఇలాంటి పప్పులేం ఉడకవు అనే స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ మా హయాంలో పూర్తి చేశామంటూ స్థానిక పార్టీల వాదోపవాదాలు నడుస్తున్న నేపథ్యంలో.. అసలు ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అని స్పష్టమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే రీతిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ రోజు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆయనతో పాటు బీజేపీ జాతీయ నాయకులు ఎంపీ GVL నరసింహారావు, కృష్ణారెడ్డి, బిజెపి ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ సునీల్ దియోదర్ తదితరులు ఢిల్లీ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయడం పై ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
