Pawan Kalyan Press Meet : ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పి.ఎ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజ్యాధికారం సాధించి, ప్రత్యర్థులు ప్రతి ఒక్కరిని నేరగాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటి ఆర్థిక వేదాల్లో 15 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద బయట తిరుగుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి… నిజంగా చట్టాలే సంపూర్ణంగా పనిచేసి ఉంటే జగన్ అనే వ్యక్తి జన్మలో ముఖ్యమంత్ర కాలేడాని అన్నారు.
విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకుంటున్న జగన్.. అందరూ కూడా తనలాగే పర్మిషన్లు తీసుకొనే ప్రయాణం చేయాలనుకోవడం అవివేకమన్నారు. వైసీపీ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారు. బెదిరిస్తారు. ఎదురు తిరిగితే హత్యాయత్నం కేసులుపెడతాడు. సమస్యలు చెప్పుకున్న దివ్యాంగులను సైతం భయపెడతారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో స్టేట్మెంట్ ఇచ్చారు.
మొదట గుండెపోటు అన్నారు. తరువాత ఇంకొకటి అన్నారు. వివేకా హత్య కేసులో వేళ్లు అన్ని ఆ కుటుంబం వైపే చూపిస్తున్నా.. మర్దర్ చేసినోళ్లు బయటి తిరుగుతున్నారు. వాళ్ళ పార్టీలో అత్యాచారాలు చేసినవాళ్లు ఉన్నారు. చట్టాలు బలంగా పనిచేసి ఉంటే వాళ్లందరూ జైల్లో ఉండేవారు. నిజంగా రాష్ట్రానికి ఇవి చీకటి రోజులు, ప్రజలందరూ మేల్కోవలసిన సమయం ఆసన్నమైంది. కృష్ణా జిల్లా ఎస్పీ లేఖే శాంతిభద్రత సమస్య సృష్టించింది.
మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమానికి హాజరవ్వడానికి బయలుదేరితే హైదరాబాద్ లో విమానం టేకాఫ్ కాకుండా చేశారు. రోడ్డు మార్గంలో వస్తే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో అడ్డుకున్నారు. మీరు వస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుంది. అందుక పర్మిషన్ ఇవ్వలేదని ఎస్పీ అంటున్నారు. నేను బలంగా మాట్లాడతాను తప్ప రెచ్చగొట్టిలా ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడాలి అంటే 10 లక్షల మంది జనం వచ్చిన మచిలీపట్నం సభలోనే మాట్లాడేవాడిని. సమాజం పట్ల బాధ్యత ఉంది కనుక ఎన్నడూ రెచ్చగొట్టేలా మాట్లాడలేదు అన్నారు పవన్ కళ్యాణ్.