Blak Tea : చాలామంది ఉదయం లేవగానే టీ తాగుతుంటారు. అది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగమైపోయింది. టీ లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో టీ ఆస్వాదిస్తూ ఉంటారు. వాటిల్లో ముఖ్యంగా బ్లాక్ టీ కూడా ఒకటి. చాలామంది బ్లాక్ టీ తాగుతారు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు వైద్యనిపుణులు, మరి ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుందాం..
బ్లాక్ టీ తాగడం వల్ల గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. బ్లాక్ టీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం నుంచి రక్షిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బ్లాక్ టీ చక్కగా పనిచేస్తుంది. అంతేకాదు మరియు ముఖ్యంగా కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బ్లాక్ టీ తాగడం వల్ల కంటి దృష్టి మెరుగు పడుతుంది. కళ్ళ మసకతో బాధపడేవారు బ్లాక్ టీ తాగితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. బ్లాక్ టీ ఇంకా అనేక రకాల సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది. మీ రోజువారి దినచర్యలో బ్లాక్ టీ నీ చేర్చుకోండిలా..
