Keerthy Suresh : సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎక్కువగా హీరో, డైరెక్టర్ పైన ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో టోటల్ గా చేంజెస్ వచ్చాయి. హీరోయిన్ కి వరుసగా ప్లాఫ్ లు వస్తే ఆ హీరోయిన్ నీ ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ వేసి మరో సినిమాలో ఛాన్స్ ఇవ్వడానికి డైరెక్టర్స్ పంపుతుంటారు. అప్పట్లో ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా హీరోయిన్స్ కి మరో సినిమాలో అవకాశం వచ్చేది.
కానీ ఇప్పుడు టోటల్ సీన్ రివర్స్ ఒకసారి ప్లాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటే ఇంకా వాళ్ళు ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమే. ఈమధ్య కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటించిన భోళాశంకర్ ఎంత అట్టర్ ప్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ అమ్మడు తర్వాత బాలీవుడ్ లో అడుగు పెడుతున్న టైంలో ఇలా తన సినిమాలు ఫ్లాఫ్ అవుతుంటే తనకు కెరియర్ పట్ల టెన్షన్ పట్టుకుందని తెలుస్తుంది..

ఇక తను కూడా వేణుస్వామితో పూజలు చేయించుకుని తన కెరీర్ ని ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుందని సమాచారం. కీర్తి సురేష్ జాతకం లో ఏవైనా దోషాలు ఉన్నాయేమో అని ఆమె తల్లి చాలా కంగారు పడుతున్నారని, సినీ ఇండస్ట్రీలో తన కూతురు ఇంకా రాణించాలంటే కచ్చితంగా తన జాతకం ఒకసారి చూపించాలని దానికి వేణు స్వామి అయితేనే కరెక్ట్ అని ఆమె భావించారంట. అందుకే కీర్తి సురేష్ కి ఇలాంటి విశ్వాసాలు లేకపోయినప్పటికీ తల్లి కోసం ఒప్పుకుందని ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది.
