Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో తన ఖాతాలో విజయాన్ని సొంతం చేసుకుంటాడని అనుకుంటూ ఉండగానే ఆ సినిమాతో కూడా నార్మల్ టాక్ ని పొందాడు. వాస్తవానికి ఈ యంగ్ రౌడీ హీరో గీతగోవిందం తర్వాత హిట్ కొట్టలేదని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత వచ్చిన లైజర్, వరల్డ్ ఫేమస్ లవర్, రెండు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఖుషి సినిమాతో అయినా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అనుకుంటే అది కూడా తు..తూ.. మంత్రంగానే ముగిసిపోయింది.
ప్రస్తుతం విజయ్, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు విజయ్ ఆశలన్నీ కూడా ఈ మూవీ పైనే ఉన్నాయి. నిజానికి ఈ మూవీని రాంచరణ్ తో చేద్దామని డైరెక్టర్ ముందుగా అనుకున్నాడు అంట, కానీ తర్వాత ఈ సినిమాకి విజయ్ ని ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ ఒక అమాయకపు కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్.
ఇప్పటికే తన అమాయకత్వం అయిన నటనతో గీతగోవిందం సినిమాలో మెప్పించిన విజయ్ ఇప్పుడు రాబోయే ఈ సినిమాలో కూడా మెప్పిస్తాడని అనుకుంటున్నారు. ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని డైరెక్టర్ చెప్పడం గమనార్హం. వచ్చే సంవత్సరం వేసవి లో ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి విజయ్ దేవరకొండ ఈ సినిమాతో నైనా హిట్ నీ సొంతం చేసుకుంటాడో లేదో.