Original Names of Heroines : ఆ తరం నుంచి ఈ తరం వరకు తమ అందం అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఎందరో హీరోయిన్ల స్క్రీన్ నేమ్స్ ఏంటో మనందరికీ తెలుసు కానీ వాళ్ళ అసలు పేర్లు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..సహజనటిగా తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు అందుకున్న అలనాటి హీరోయిన్ జయసుధ గారి అసలు పేరు సుజాత.
అలానే జయప్రదగారి అసలు పేరు లలిత రాణి.. శారద గారి అసలు పేరు సరస్వతి దేవి. బాలనటిగా చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టి తెలుగు, తమిళ్ భాషలే కాదు హిందీ పరిశ్రమను కూడా ఏలిన శ్రీదేవి గారి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్.. రాధా అసలు పేరు ఉదయ చంద్రిక వాయర్.

సౌందర్య గారి అసలు పేరు సౌమ్య. ఆమని గారి పేరు మంజుల. ఇక ఫైర్ బ్రాండ్ రోజా గారి అసలు పేరు శ్రీలత రెడ్డి. రాశి గారి అసలు పేరు విజయలక్ష్మి. స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు. రంభా అసలు పేరు విజయలక్ష్మి. ఖుషి హీరోయిన్ భూమిక అసలు పేరు రచనా చావ్లా. సిమ్రాన్ అసలు పేరు రిషి బాల నావెల్. అంజలి అసలు పేరు బాలా త్రిపుర సుందరి. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి.
ఇవి కాక ఇంకా ఎవరైనా మీకు తెలిసిన హీరోలు, హీరోయిన్ల అసలు పేర్లు ఏంటో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి..
