Keeda Cola Movie : పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది..? హిట్స్ తీసిన తర్వాత కూడా తరుణ్ భాస్కర్ మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోలేదు.. మధ్యలో పిట్టకథలు సినిమా తీసినా అది ఓన్లీ OTTలోనే రిలీజ్ అయింది. ఈ గ్యాప్ లో కొన్ని సినిమాలకు డైలాగ్స్ వ్రాసారు ఆయన.. అలాగే కొన్ని సినిమాల్లో ఆర్టిస్ట్ గా కూడా కనిపించారు. సీతారామం సినిమాలో ఆయన యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడు తాజాగా కీడాకోలా సినిమాతో మళ్లీ మెగా ఫోన్ పట్టారు.
తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం ముఖ్య పాత్రధారులుగా నటించిన కీడాకోలా సినిమా నేడు (నవంబర్3) ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీమియర్స్ తో ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది.. ఓవర్సీస్ లో 400 లొకేషన్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్ గానే రిలీజ్ అవుతుంది.
వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 9 కోట్ల వరకూ బిజినెస్ జరిగిందని అంచనా. అంటే ఈ సినిమా హిట్ కావాలంటే 9 కోట్ల కు పైగా షేర్ ను సొంతం చేసుకోవాలి. తరుణ్ భాస్కర్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉండడం.. ఆల్రెడీ ప్రీమియర్స్ తో మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా కి అది పెద్ద విషయం కాకపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో..?