ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ నిర్వహించిన ఒలింపియాడ్ పోటీలో భారత్ రష్యా తో కలిసి తొలిసారి పతకాన్ని కైవసం చేసుకుంది.
తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ప్రతిభ వలన ఫైనల్స్ వరకూ వెళ్లిన భారత్, ఫైనల్స్లో రష్యాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మొదటిసారిగా ఆన్లైన్ లో నిర్వహించిన ఈ పోటీలో భారత్ రష్యాలు సంయుక్తంగా బంగారు పతకాలు గెలుచుకున్నాయని, వారికి త్వరలోనే పతకాలు అంద చేయాలని నిర్ణయించినట్లు ఫిడె అధ్యక్షుడు అర్కడీ వోర్కోవిచ్ తెలిపారు. ఈ మేరకు ఇండియన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మేము గెలిచాము. రష్యా కు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. 163 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ ఫైనల్ కు చేరడం ఇదే మొదటిసారి. తెలుగు తేజం కోనేరు హంపి ఫైనల్స్ లో సత్తా చాటి భారత జట్టు పతకాన్ని ఖాయం చేశారు.
