Vitamin K Deficiency : మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరానికి కావలసిన ఖనిజాలు, పోషకాలు, విటమిన్లు సరైన మోతాదులో అందితేనే అది సాధ్యం. అయితే విటమిన్ K శరీరంలో లోపించడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మన శరీరానికి విటమిన్ కే రక్తం గడ్డ కట్టడం కుండా గాయం నయం చేయడానికి ఉపయోగపడుతుంది ఇది గుండె ఆరోగ్యంగా ఎముకలు పటిష్టంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. విటమిన్ కె లోపిస్తే ఊపిరితిత్తులు సమస్య కూడా రావచ్చు అలాగే బోలు ఎముకల వ్యాధి ఎముకలు బలహీనంగా మారడం తెలుసుగా మారటం జుట్టు రాలిపోవడం వెన్నునొప్పి బరువు తగ్గడం అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలు కనిపించడం వెంటనే సంప్రదించడం ఉత్తమం మరి విటమిన్ కె శరీరానికి సమృద్ధిగా అందాలంటే ఏ ఆహారం తీసుకోవాలి. విటమిన్ K సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినడం ఈ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాంటి విటమిన్ K ఉన్న కొన్ని ఆహారాలను ఇక్కడ తెలుసుకుందాం..
విటమిన్ K సమృద్ధిగా మనకు అందాలంటే ముఖ్యంగా, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, కివి పండ్లు, అవకాడో, సోయాబీన్స్ కచ్చితంగా తీసుకోవాలి. వీటన్నింటిలో ఉండే విటమిన్స్ K మన శరీరాన్ని కాపాడుతుంది. అలాగే వీటితో పాటు ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా మన శరీరానికి దొరుకుతాయి.