Animal – Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి రెండు సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో తన పాగా వేసి, హిందీలో కబీర్ సింగ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా వస్తున్న సినిమా యానిమల్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాపై రచ్చ మామూలుగా లేదు.
అర్జున్ రెడ్డి కంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రేక్షకులు ముందుగానే జోష్యం చెప్పేస్తున్నారు. సినిమా పేరుకు తగ్గట్టుగానే హీరోని కూడా యానిమల్ లాగానే చూపించాడు సందీప్. ఆ సినిమా టైటిల్ ని ఎన్నుకోవడం వెనుక అసలు నిజాన్ని బహిర్గతం చేశాడు సందీప్ రెడ్డి. మనం ఎవరో తెలియనప్పుడు మనం ఎదిగే క్రమంలో మనకు సంబంధించి తెలివితేటలు, చదువు ఇలా సంక్రమిస్తూ వచ్చాయి.

దానిని బట్టి మనం మనిషి అని పేరు పెట్టుకున్నాము. మనిషి ఒక సోషల్ యానిమల్ అని తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చాడు ఈ డైరెక్టర్. మనుషులకు ఐక్యూ ఉంటుంది కాబట్టి, కమ్యూనికేషన్ పెరుగుతూ ఫుడ్ చెయిన్‌లో మొదటిగా వస్త్రాలు వేసుకోవడం మొదలు పెట్టారు. ఒకవేళ మనుషులకు ఐక్యూ లేకపోతే మనుషులు కూడా ఒక యానిమల్ ఏ కదా అని చిన్న సబ్జెక్టుతో తను ఓ కథను తెరకెక్కించినట్టు డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
తను సోషల్ సబ్జెక్టు చదివి దగ్గర నుండి ఎప్పటికీ ఈ విషయం తన మైండ్‌లో రన్ అవుతూనే ఉండేదని క్లారిటీ ఇచ్చాడు. నేను ఆలోచించింది ఏంటంటే యానిమాల్ కి ఐక్య ఉండదు. తన ప్రవృత్తి తో ప్రవర్తిస్తూ ఉంటారు. యానిమల్ సినిమాలో హీరో పాత్ర కూడా అలాగే వ్యవహరిస్తూ ఉండేటటువంటి పాత్ర. అలాంటి పాత్రకు యానిమల్ అనే టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని, ఈ సినిమాకు ఆ పేరు పెట్టానని, ఆ పేరు వెనుక ఉన్న కథని చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి. చూడాలి ఈ సినిమా అర్జున్ రెడ్డి టైప్ లో దూసుకు వెళ్తుందా.. ప్రేక్షకులను అలరిస్తుందా.. లేదా అనేది.
