మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఢిల్లీలోని ఆర్మీ కి చెందిన రీసెర్చ్ అండ్ రిఫరల్ హస్పటల్ లో కొద్దిసేపటి క్రితం మృతి చెందిన విషయం ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ అధికారికంగా వెల్లడించారు.
ప్రణబ్ ముఖర్జీ 2012 నుండి 2017 వరకు భారత అత్యున్నత పదవి రాష్ట్రపతిగా పనిచేసారు. ఆయన మృతిపై ప్రస్తుత రాష్ట్రపతి శ్రీ రామ్ నాధ్ కోవిడ్ సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ అధ్యక్షుడు శ్రీ ప్రణబ్ ముఖర్జీ లేరని విన్నప్పుడు విచారంగా ఉంది. అయన మరణంతో ఒక శకం గడిచిపోతోంది. ప్రజా జీవితంలో ఒక గొప్ప వ్యక్తి, అయన ఆత్మతో మదర్ ఇండియాకు సేవ చేశారు, దేశం తన విలువైన కుమారులలో ఒకరిని కోల్పోయింది. ఆయనను కోల్పోయిన కుటుంబానికి, స్నేహితులకు దేశ ప్రజలకు ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నానని రాష్ట్రపతి ట్విట్ చేసారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపై దేశంలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.