BRS Will Win the Telangana Assembly Elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరవుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రగాఢమైన నమ్మకంతో ముందుగానే గెలుపును ఆస్వాదిస్తుంది. కచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీనే తిరిగి తన సత్తా చాటానుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దీనికి కొన్ని విషయాలు జోడిస్తే అది నిజమే అని అనిపిస్తుంది.
ముఖ్యంగా సీఎం కేసీఆర్ దాదాపు 90 సభలకు పైగా హాజరయ్యారు.ఇలా పర్యటించడమే బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్ గా నిలిచింది. దానివల్ల ప్రజలలో, పార్టీ శ్రేణులల్లో కూడా ఉత్సాహం నెలకొంది. సీఎం కేసీఆర్ తొలి రోజు నిర్వహించిన బహిరంగ సభ నుంచి మొదలు పెడితే, చివరి రోజు గజ్వేల్ లో నిర్వహించిన బహిరంగ సభ వరకు ఒక విషయం స్పష్టమవుతుంది.
జనం స్వచ్ఛందంగా గులాబీ జెండాను పట్టి వచ్చారని సర్వేలు చెబుతున్నాయి. అలాగే కేసీఆర్ వల్లనే మాకు అభివృద్ధి సాధ్యమని ప్రజలలో ప్రగాఢ నమ్మకం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఈసారి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని అంటున్నారు. ఈ లెక్కన హ్యాట్రిక్ కొట్టే సీఎంగా కేసీఆర్ వార్తల్లోకి ఎక్కుతారు.
కాంగ్రెసు, బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇస్తుందని మరొక ప్రచారం కూడా ఉంది. అయితే ఇది కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవుతుందని కొన్ని వర్గాల సమాచారం. క్షేత్రస్థాయిలో పరిశీలించుకుంటే ప్రజల మనసుల్లో బీఆర్ఎస్ బలంగా ఉందనేది స్పష్టమవుతుంది. రాబోయే సర్కారు కచ్చితంగా బీఆర్ఏస్ అనేది చాలామంది తెలుపుతున్న సత్యం.
సీఎం కేసీఆర్ మాట చాతుర్యత ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. ఆయన ప్రసంగం వింటున్నంత సేపు దాంట్లో సెటైర్లు, ప్రత్యర్థులను మాట్లాడే తీరు, వ్యంగం కలబోసి ఉంటాయి. ఆయన స్పీచ్ కోసమే చాలామంది ఆయన సభలకు హాజరవుతూ ఉంటారు. ఆ ప్రసంగాలు ప్రజలు పైన బలమైన ముద్రను వేస్తాయి. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చెప్పడంలో కేసీఆర్ దిట్ట. కేసీఆర్ 100% సక్సెస్ ఆయన ప్రసంగాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇక కాంగ్రెస్, బిజెపిలో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు.
ప్రజలకు కేసీఆర్ అండగా ఉండగా వాళ్ళు తోక ముడవాల్సిందే అని కేసిఆర్ వ్యంగ్యాస్త్రాలను విడిచారు. అలాగే ప్రజల కష్ట,నష్టాలను వివరించడంలో కాంగ్రెస్, బిజెపితో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చెప్పడంలో కేసీఆర్ ఎప్పుడూ ముందంజలో ఉంటారు. ఆయన చెప్పే తీరు ప్రజలను బాగా ఆకట్టుకుంటుంది. ఇవన్నీ పరిశీలిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉండి, ప్రజల్లో మళ్ళీ స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంటుందని చెప్పవచ్చు.