Election Ink : ఎన్నికల్లో సిర చుక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ప్రజలు తమ ఓటును వినియోగించాము అని తెలపడానికి గుర్తుగా తమ చూపుడు వేలు మీద సిరా చుక్కను అధికారులు వేస్తారు. భారత ఎన్నికల సంఘం దశాబ్దాలుగా ఈ విధానాన్ని అమలు చేస్తూ ఉంది. సిరా చుక్క ఎలా తయారు చేయబడుతుంది. దాని వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాం.
నేడు తెలంగాణలో ఎన్నికల జాతర జరుగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగం తర్వాత చెరిగినటువంటి సిరా గుర్తును చూపుడువేలు మీద ఉంచుతారు. ఈ సిరా వెనుక చాలా పెద్ద చరిత్ర దాగి ఉంది. తొలిసారి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు వారికి వచ్చిన ఆలోచన సిరాచుక్కను కొన్ని రోజులు పాటు చెదిరిపోకుండా గుర్తుగా వాడాలి అని, బ్లూ ఇంక్ పద్ధతి అప్పటినుంచి అమల్లోకి వచ్చింది.

మన భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా ఈ సిరాను ఉపయోగించారు. ఆర్ అండ్ సంస్థ ఈ ఇంక్ ను తయారు చేస్తుంది. ఆ తర్వాత మైసూర్ లోని పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కు దీన్ని బదిలీ చేయడం జరిగింది. అప్పటినుంచి భారతదేశంలో జరిగే అన్ని ఎన్నికలకు ఇక్కడి నుంచే సిర తయారై వస్తుంది. ఈ కంపెనీ మన దేశంలోనే కాకుండా ఇతర
దేశాలైనటువంటి నేపాల్, మాల్దీవులు, నైజీరియా, కెనడా, కంబోడియా, దక్షిణాఫ్రికా, టర్కీ సహా మరికొన్ని దేశాలకు ఎన్నికల అవసరాలకు సరఫరా చేస్తారు. ఈ సిరాను తయారు చేయడం కొరకు 15 నుండి 18 శాతం సిల్వర్ నైట్రేట్ కొన్ని రసాయనాలను వాడుతారు. ఈ సిరా కొన్ని రోజుల వరకు వాడిపోకుండా ఉంటుంది. ఇది 5, 7, 5, 20, 50 ml సీసాలలో లభిస్తుంది. 300 మంది ఓటర్లకు 5 ఎంఎల్ బాటిల్ సరిపోతుంది. ఈ బాటిల్ ధర సుమారు రూ. 127 అవుతుంది. ఒక సీసాలో 10 మి.లీ. సిరా ఉంటుంది.
