YS Sharmila’s Gift to KCR : తెలంగాణ ఎలక్షన్స్ ముగిసిన నేపథ్యంలో, ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్, కొన్ని సర్వేల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణను పరిపాలించబోయేది అని బహిర్గతం అవుతున్న నిజం. ఇక ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి తమకు పరాజయం తప్పదని డిసైడ్ అయ్యారు. దానికి అనుగుణంగానే కేసీఆర్ వ్యాఖ్యలు, పనితీరు, కేటీఆర్ ప్రెస్ మీట్ బలాన్ని చేకూరుస్తుంది. ఇది ఇలా ఉండగా వైఎస్ షర్మిల కేసీఆర్ కి ఒక వినూత్నమైన గిఫ్ట్ అందించారు.
కేసీఆర్ ఓడిపోతారని మాకు ముందే తెలుసు. బీఆర్ఎస్ కచ్చితంగా కాంగ్రెస్ ని ఓడిస్తుంది. అది వాళ్లకు సాధ్యమైన పని. అలా కాకూడదనే ఆలోచనతో మేము కాంగ్రెస్ కి సపోర్ట్ చేశాము. ఎలాగైనా కేసీఆర్ ని గద్దెదించాలనేదే మా లక్ష్యం. అందుకే కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపి, మేము త్యాగం చేసి ఎన్నికల్లో విజయం సాధించేలాగా చేసాము. ఇక కేసీఆర్ పెట్టే, బేడే సదురుకొని ఇంటి ముఖం పట్టాల్సిందే. అందుకే కేసీఆర్ కి సూట్ కేసు ని నేను బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పారు.

వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేసి తను ఇస్తున్నటువంటి సూట్ కేసును కూడా అందరికీ చూపించారు. దానిమీద “బాయ్, బాయ్ కేసిఆర్” అని రాసిపెట్టి ఉంది. అన్నీ చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్, సర్వేలు అన్నీ చూస్తుంటే కాంగ్రెస్ విజయం తథ్యం అని మరో మారు రుజువు అయింది.
