Heart Attack Symptoms : శరీరంలో వచ్చేటటువంటి మార్పులను మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. శరీరం లోపల ఏదైనా కాస్త ఇబ్బందిగా అనిపిస్తే, ఆ లక్షణం శరీరం పైభాగాన కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని లక్షణాలను గుర్తించడం వల్ల అత్యంత ప్రమాదకరమైన గుండె నొప్పి నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఆ లక్షణాలు ఎంటో తెలుసుకుందాం.
మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ప్రధానమైనది. 24 గంటలు గుండె పనిచేస్తూనే ఉంటుంది. మారుతున్న జీవనశైలిలో చెడు ఆహారం కారణంగా గుండెపోటు సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ ప్రమాదాన్ని తగ్గించాలంటే ఆహారాన్ని సరైనది తీసుకోవాలి. గుండెపోటు వచ్చే ముందు కాళ్లు మరియు చేతులలో ఈ లక్షణాలు కనిపిస్తే మీరు వెంటనే జాగ్రత్తపడాలి.

పాదాల రంగు మారుతుంది : గుండెపోటు వచ్చే ముందు శరీరంలోని అన్ని అవయవాలలో తగినంత రక్తాన్ని పంపించలేదు. ఆక్సిజన్ లేని రక్తం వల్ల శరీరం యొక్క రంగు నీలం రంగులోకి మారిపోతుంది. ఇది గుండెపోటు, మరియు గుండె సంబంధిత వ్యాధులకు సంకేతం.
కాళ్లలో వాపు : గుండె సమస్య ఉంటే రక్తం సరిగా పంపు చేయకపోవడం వల్ల, కాళ్లకు చేరవలసిన రక్తం ఆలస్యంగా సరఫరా అవుతుంది. దీనివల్ల కాళ్లలో వాపులు వస్తాయి. ఇది కూడా గుండె నొప్పికి ముందు లక్షణమే. దీనిని గమనించినట్లయితే సమస్య నుండి బయటపడవచ్చు.
పాదాలలో నొప్పి : పాదాలలో నొప్పి సహజంగా కొంతమందికి వస్తూ ఉంటుంది. కానీ దానిని అశ్రద్ధ చేయవద్దు. గుండెనొప్పి వచ్చే ముందు ఈ లక్షణం కూడా కనబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్త అవసరం.
కాళ్లలో బలహీనత : కాళ్లు చాలామందికి లాగుతూ ఉంటాయి. కాళ్ల నొప్పిని ఒక్కోసారి తట్టుకోలేరు. మీ కాళ్లు బలహీనపడుతున్నట్లు మీకు అనిపిస్తే, అది గుండె సంబంధిత సమస్యలకు సంకేతం కూడా కావచ్చు. రక్తం సరిగ్గా పంప్ చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కాళ్లు మరియు పాదాలలో బలహీనత వంటి లక్షణాలను విస్మరించకూడదు.
