Problems Caused by not Drinking Water in Winter : ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన మేరకు నీరును త్రాగకపోతే శరీరం చాలా అనారోగ్య సమస్యలకు మూలం అవుతుంది. ముఖ్యంగా చలికాలంలో అందరూ నీటిని తాగే శాతాన్ని తగ్గిస్తూ ఉంటారు. కానీ దానివల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నీరు మన శరీరాన్ని హైడ్రెడ్ కాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్న మలినాలను తొలగించడంలో కూడా నీరు ప్రధాన పాత్ర వహిస్తుంది. తగినంత నీరు అందకపోతే తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మూత్రపిండాల సమస్య : శరీరానికి నీరు శాతం తగ్గితే కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రపిండాల సక్రమంగా పనిచేయడానికి నీళ్లు చాలా అవసరం. తగినంత నీరు అందకపోతే మూత్రపిండాలు పనితీరు మందగిస్తుంది. దీనివల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
UTI సమస్య : యుటిఐ సమస్య అనేది ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయినప్పటికీ, దీని వెనుక మూలకారణం మాత్రం నీటిని సరైన మోతాదులో తీసుకోకపోవడమే, కాబట్టి చల్లని వాతావరణంలో కూడా శరీరానికి తగినంత నీరును అందించాలి.
తలనొప్పి : శరీర భాగాలకు తగిన మోతాదులో నీరు అందకపోతే దాని ప్రభావం తల మీద చూపెడుతుంది. నీరు అందకపోతే శరీరంలో హైడ్రేషన్ స్థాయి పడిపోతుంది. దాని కారణంగా తలనొప్పి సమస్య వస్తుంది.
మలబద్ధకం : నీరు తక్కువగా తాగడం వల్ల ప్రధానంగా మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది మనం తక్కువ నీరు తాగినప్పుడు అది నేరుగా మన పొట్టపై ప్రభావం చూపుతుంది దానివల్ల మలబద్ధకం సమస్య వస్తుంది.
చర్మం నిర్జీవంగా మారడం : చలికాలంలో చర్మం పొడిబారినట్టుగా మారుతుంది. దీని వెనక చాలా పెద్ద కారణం నీరు తగిన మోతాదులో త్రాగకపోవడమే.
UTI సమస్య : యుటిఐ సమస్య అనేది ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయినప్పటికీ, దీని వెనుక మూలకారణం మాత్రం నీటిని సరైన మోతాదులో తీసుకోకపోవడమే, కాబట్టి చల్లని వాతావరణంలో కూడా శరీరానికి తగినంత నీరును అందించాలి.
ఒక రోజులో ఎంత నీరు త్రాగాలి?
వేసవికాలంలో కంటే చలికాలంలో తక్కువ నేరు తాగితే సరిపోతుందని అందరూ అపోహ పడుతుంటారు. కానీ అది చాలా వరకు నష్టం చేకూరుస్తుంది. చల్లని రోజులలో కూడా కచ్చితంగా మూడు నుండి నాలుగు లీటర్ల నీరు త్రాగాలి.