Heart Attack Reasons : ఈరోజుల్లో గుండెపోటుకు వయసుతో సంబంధం లేకుండా పోయింది. ఇది యువతలోనూ, పెద్ద వయసు వారిలోనూ, అలాగే చిన్నపిల్లల్లోనూ వస్తుంది. దీనికి సరైన కారణాలను వైద్యులు కొన్నింటిని సూచిస్తున్నారు. ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గుండెపోటు బారి నుండి బయటపడవచ్చు అని వారు వెల్లడిస్తున్నారు.
ముఖ్యంగా మారుతున్న జీవన శైలి, జన్యూ శాస్త్రం గుండె ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. అలాగే చిన్న వయసులో గుండెపోటుకు చాలా రకాల కారణాలు ఉన్నాయని వారు వెల్లడించారు. ఆ కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కుటుంబ చరిత్ర
కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. ఒకవేళ అటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
వ్యాధులు
ముఖ్యంగా హై బీపీ, హై కొలెస్ట్రాల్, మధుమేహం ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరు జీవనశైలిని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. లేకపోతే సమస్య అటాక్ చేసే అవకాశం ఉంటుంది. తరచుగా డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ టెస్టులు చేయించుకోవడం అవసరం.
టెన్షన్
ప్రతిరోజు వ్యాయామం కచ్చితంగా చేయాలి. అలాగే ఎక్కువగా టెన్షన్ పెట్టుకోకూడదు. సరైన ఆహారాన్ని, సరైన సమయంలో తీసుకోవాలి. మధ్యపానం, ధూమపానం లాంటివి యువతలో గుండెపోటు రావడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ఈ అలవాటుని ఎంత తొందరగా మానుకుంటే వారి ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం. లేదంటే భవిష్యత్తులో చాలా రకాల వ్యాధులను కూడా వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తెలియని లక్షణాలు
యువతలో ఎక్కువగా గుండె సమస్యలు రావడానికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చాతిలో అసౌకర్యంగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, అలసట వంటివి కనిపిస్తాయి. వీటిని ముందే గుర్తిస్తే ప్రమాదం బారిన పడకుండా ఉండవచ్చు.