Suresh Kondeti : హీరో, హీరోయిన్లనీ జర్నలిస్టులు ప్రశ్నలు అడగడం సహజం. వాళ్లకోసం ప్రత్యేకమైన ప్రెస్మీట్ లు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సురేష్ కొండేటి అనే జర్నలిస్టు మాత్రం చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు హీరో, హీరోయిన్ ని అడిగి ఆ న్యూస్ వైరల్ అవ్వాలి, ఆయన ట్రెండింగ్ లో ఉండాలని ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటాడు. మొదటి నుంచి కూడా సురేష్ కొండేటి సినీ రంగం వాళ్లపైన అసలు, మనుషులే కాదు, వాళ్లకు మనసే ఉండదని విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
సురేష్ వల్ల మీడియా మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని జర్నలిస్టుల సంఘం అభిప్రాయపడింది. సురేష్ కొండేటి అడిగే ప్రశ్నలకు సెలబ్రిటీస్ చాలా సార్లు సీరియస్ కూడా అయ్యారు. అయినా సురేష్ కొండేటి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. తన నుండి అలాగే విచిత్రమైన ప్రశ్నలు వస్తూ ఉండేవి. దానివల్ల హీరోయిన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సురేష్ కొండేటి సంతోషం అనే మ్యాగజైన్ కూడా నడుపుతూ ఉంటాడు.
ఈ నేపథ్యంలో జర్నలిస్టుల అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకమీదట సురేష్ కొండేటి ఎటువంటి ప్రెస్మీట్ లకు హాజరు కావద్దని నిర్ణయించింది. తన సంస్థ నుండి పీఆర్వో లు ప్రెస్ మీట్ కి రావచ్చు అని అసోసియేషన్ తెలిపింది.
అయితే ఈ నిర్ణయం మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. తన సంస్థ నుండి వచ్చే పిఆర్వో లు కూడా అలాంటి ప్రశ్నలే అడుగుతారు కదా, సురేష్ కొండేటి వారికి ఎలాంటి ప్రశ్నలు అడగాలో ముందే
ప్రిపేర్ చేసి పంపిస్తాడు కదా, అని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అసోసియేషన్ వారు ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడగాలి అన్నా కూడా ముందు అసోసియేషన్ ముందు పెట్టాలి. అసోసియేషన్ ఆ ప్రశ్నలను ఓకే అంటేనే అడగాలి అని కొత్త రూల్ ని పెట్టింది. ఇక ఈ దెబ్బతో సురేష్ కొండేటి నోటికి తాళం పడ్డట్టే అని అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.