Payal Rajput : పాయల్ రాజ్ పూత్ ఈ అమ్మడి పేరు మీకు కొత్త ఏమి కాదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి థియేటర్స్ ని, ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన ఈ బ్యూటీ, తర్వాత మంచి సినిమాలలో అవకాశాలు రాక, చాలా రోజులు ఖాళీగానే ఉంది. ఈమధ్య “మంగళవారం” సినిమాతో తన ప్రయాణాన్ని మళ్లీ మొదలు పెట్టింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ సినిమాలో ఛాన్స్ కోసం పాయల్ చాలా రిస్క్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పవచ్చు.
ఎందుకంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చాలామంది కొత్త హీరోయిన్స్ వస్తున్నారు. పాత హీరోయిన్స్ కి కొద్దో, గొప్పో ఛాన్సులు దక్కుతున్నాయి, ఇంత పోటీని తట్టుకొని పాయల్ ఒక సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. మరో రకంగా చెప్పాలంటే ఒక మెట్టు కిందికి దిగి అవకాశాల కోసం రిక్వెస్ట్ చేసిందని చెప్పవచ్చు. మంగళవారం సినిమా సెలక్షన్స్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ అజయ్ భూపతిని నేరుగా పాయల్ ఈ సినిమాలో నాకు చాన్స్ ఇవ్వండి అని అడిగిందట.

అప్పటికే హీరోయిన్ కోసం వెతుకుతున్న అజయ్ భూపతి పాయల్ తో ఇదివరకే ఉన్న పరిచయం వల్ల నో చెప్పలేకపోయాడంట, వెంటనే ఆ సినిమాలో అవకాశం ఇవ్వడం ఆ సినిమా మంచి టాకింగ్ తెచ్చుకోవడం కూడా జరిగిపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్యనే కాంతారా2 కోసం కూడా నటీనటుల కోసం ఆ టీం ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో పాయల్ పబ్లిక్ గానే నాకు చాన్స్ ఇవ్వండి నేను నటిస్తాను అని రిక్వెస్ట్ చేసింది.
ఆ సినిమాలో తనని తీసుకుంటారా..? లేదా..? అనేది ఇంకా సస్పెన్స్. తాజాగా పాయల్ గురించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇలా నేరుగా అడగడం పాయల్ ను ఒక మెట్టు దించుతుందో, లేదో తెలియదు కానీ, ఈమధ్య ఒక డైరెక్టర్ మా సినిమాలో నటించండి అని ఫైల్ కి ఆఫర్ ఇచ్చాడంట. దాంతో సంతోషంగా ఫీల్ అయిన పాయల్ హీరో ఎవరు అని అడగడంతో, సంపూర్ణేష్ బాబు అని చెప్పాడంట. మరి సంపూర్ణేష్ బాబుతో నటించడానికి పాయల్ ఓకే చెప్పిందా.. లేదా.. అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
