Kajal Shocking Comments about Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి డాన్స్ లో రారాజుగా పేరు పొందాడు. డాన్స్ చేయడంలో చిరంజీవి తర్వాతనే మరి ఎవరైనా కూడా, ఇప్పటికీ తన సినిమాలలో చిరంజీవి మొదట్లో ఎలాగైతే డాన్స్ చేశారో, ప్రస్తుతం అంత వయసులోనూ అదే ఎనర్జీతో డాన్స్ చేస్తున్నారు. డాన్స్ లో అతన్ని అందుకోవాలంటే ఒక సవాల్ అని చెప్పవచ్చు. చిరంజీవి హయాంలో వచ్చిన సినిమాలన్నీట్లో హీరోయిన్లు ఆయనతో డాన్స్ చేయాలంటే కాసింత భయపడేవారు.
అప్పట్లో రాధ, విజయశాంతి, భానుప్రియ లాంటి వాళ్లు కూడా ఒక్కోసారి వందలకు మించిన టేకులు తీసేసుకునేవాలంట, కానీ చిరంజీవి మాత్రం సింగల్ టేక్ లోనే పెర్ఫార్మెన్స్ ని ఫుల్ ప్లేజ్డ్ గా ఇచ్చేసేవారట. అయితే రీసెంట్గా చిరంజీవి గారి గురించి కాజల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయనతో నటించడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆయన సీన్లు కానీ డాన్స్ ని కానీ ఒక టేక్ లోనే ఫినిష్ చేసేస్తారు. కానీ చిరంజీవి గారితో డాన్స్ చేయాలంటే నేను కనీసం ఆరు,ఏడూ టేకులు తీసుకునే దాన్ని, ఆ సమయంలో నేను
![]()
చాలా నరకం అనుభవించేదాన్ని, ఆయనకు కోపం వచ్చేస్తుందేమో, ఏమైనా అంటారేమో అని భయపడిపోయేదాన్ని, అందరి హీరోలతో డాన్స్ చేయడం ఒక ఎత్తు అయితే, చిరంజీవి గారితో చేయడం మాత్రం ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. డాన్స్ లో ఆయనను బీట్ చేయడం ఎవరి తరం కాదు. ఇప్పటికి కూడా చిరంజీవి గారిలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. చిరంజీవి గారి నుండి డాన్స్ లో నేర్చుకోవాల్సిన మెలకువలు ఎన్నో ఉన్నాయి, అని చెప్పుకొచ్చింది ఈ అందాల భామ.
