Nidhi Aggarwal as Heroine with Prabhas : సలార్,కల్కి సినిమాల తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా లో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటారని ఇదివరకే ఒక వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్త నిజమే అన్నట్లుగా దర్శకుడు మారుతి కూడా ఒక ఇంటర్వ్యూలో ఆఫ్ ది రికార్డ్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.
అయితే ఈ సినిమాలో ఇప్పటికే మాళవిక నాయర్ ని హీరోయిన్ గా ప్రకటించారు. రెండో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నట్టు ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్తను నిజం చేస్తూ ఇటీవల జరిగిన షెడ్యూల్లో ప్రభాస్ తో కలిసి నిధి అగర్వాల్ కూడా పాల్గొంది. ఇప్పుడు ఈ వార్త నిజమే అని తేలింది. నిధి అగర్వాల్ చేతిలో సినిమాలు లేకుండా ఖాళీగానే ఉంది.

పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లులో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేయడానికి ఎంపికైంది. ఈ సినిమాలో కనుక నిధి అగర్వాల్ నటిస్తే పాన్ ఇండియా లెవెల్లో తన పేరు మారుమోగిపోతుంది. తన సినీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది అనడంలో అనుమానమే లేదు.
సలార్ సినిమా తర్వాత కల్కి సినిమాలో ప్రభాస్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే, దాని తర్వాత మారుతి సినిమా రాబోతుంది. ప్రభాస్ సినిమా అనగానే యాక్షన్ అనుకుంటారు కానీ, మారుతి అందుకు విరుద్ధంగా చాలా కొత్తగా విభిన్నంగా ప్రభాస్ సినిమాలో చూపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి మూడో హీరోయిన్ గా ఎవరి పేరును సెలెక్ట్ చేస్తారో చూడాలి.
