New Buses in Telangana : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం వల్ల మహిళలు చాలా సంతోషంగా ప్రయాణాలు చేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. బస్ లు తక్కువగా ఉండడంతో ఎక్కే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ విషయము ఆర్టీసీ ఎండి సజ్జనార్ దృష్టికి వెళ్ళింది. వెంటనే ప్రభుత్వం దీని గురించి స్పందిస్తూ.. ఊహించని విధంగా నిర్ణయాన్ని తీసుకుంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసమే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ సర్వీసులను మొదలుపెట్టామని వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రయోజనాలు చేకూర్చేలా ఆలోచన చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది.

దీంట్లో భాగంగానే ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త బస్సులను తీసుకువస్తామని ఎండి సజ్జినార్ వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో రూటు బస్సుల్లో చాలామంది ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందంటూ ఎండి సజ్జనారు తెలిపారు. దీన్ని నివృత్తి చేయడానికి టిఎస్ఆర్టిసి సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది అన్నారు.
రాబోయే నాలుగైదు నెలల్లోనే 2050 కొత్త బస్సులను అందుబాటులోకి తేనున్నట్టు సజ్జనార్ ప్రకటించారు. వాటిల్లో 1,050 డీజిల్ బస్సులు కాగా, మరో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు అని ఆయన వెల్లడించారు. విడతల వారీగా బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
