Sandeep Reddy Vanga Next Movies : సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. తనదైన స్టైల్ లో సినిమాలు తీసి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన దర్శకుడు. ఇతడు తీసినవి కేవలం మూడు సినిమాలే అయినప్పటికీ ఆ సినిమాలతోనే ఒక రేంజ్ లో ఎదిగిపోయాడు. ప్రస్తుతం ఈయన తీసిన యానిమల్ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ చెప్పనవసరం లేదు. ఇప్పటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకు వెళ్తూనే ఉంది.
అయితే సందీప్ రెడ్డి వంగా రాబోయే కాలంలో తీసే సినిమాల క్రేజీ అప్డేట్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు ఈ టాపిక్ చాలా ట్రెండింగ్ లో ఉంది. సందీప్ రెడ్డి తన నెక్స్ట్ సినిమాని ప్రభాస్ తో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ప్రభాస్ ఇప్పటికే దానికి ఓకే చెప్పడం, సినిమా పేరు “స్పిరిట్ గా” ఖరారు అయింది. ప్రభాస్ కి రెండు సంవత్సరాల ముందే ఈ స్టోరీ గురించి చెప్పినట్టు, దానికి ప్రభాస్ వెంటనే ఓకే అన్నాడని తెలిసింది. యానిమాల్ మూవీ

పూర్తి కాగానే, వెంటనే దీన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు సందీప్ రెడ్డి. ఇంకా ఆ తర్వాత రణ్ బీర్ తోనే మరో సినిమా ప్లాన్ చేశాడు. యానిమల్ పార్క్ అనే సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇది యనిమాల్ మూవీ కంటే ఇంకా ఎక్కువ రేంజ్ లో దూసుకు వెళ్తుందని సందీప్ రెడ్డి వంగా చెప్పడం విశేషం. దాని తర్వాత అల్లు అర్జున్ కి కూడా కథను చెప్పినట్టు తెలుస్తుంది. దానికి అల్లు అర్జున్ కూడా ఓకే అన్నట్టు, కాకపోతే పుష్ప 2 తర్వాత రెండు
సినిమాలు ఒప్పుకోవడంతో ముందు ఆ డైరెక్టర్ల సినిమాలను చేసిన తర్వాతనే సందీప్ రెడ్డివంగా సినిమా చేస్తానని అల్లు అర్జున్ చెప్పినట్టు తెలుస్తుంది. మూడు సినిమాలతోనే ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపిన సందీప్ రెడ్డి వంగా రాబోయే సినిమాలతో ఇంకేరకంగా తన ముద్ర వేస్తాడో వేచి చూడాల్సిందే.
