This is the Reason why the Japanese Live Longer : జపాన్ లో 100 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఇంకా బ్రతికున్న వాళ్ళ సంఖ్య రెండు శాతం ఉంది. అవును మీరు వినేది నిజమే. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా జపాన్ లోని ప్రజలు జీవిస్తున్నారు. దాని వెనక కారణాలు ఏమిటి.. వారి ఆయుష్షు పెరుగడానికి కారణాలు ఏమిటి..? ఈ విషయాల గురించి ఆలస్యం చేయకుండా వెంటనే తెలుసుకుందాం..
ముఖ్యంగా మనం కూరలలో వాడే ఆయిల్ ని పరిగణలోకి తీసుకోవాలి. చాలా రకాల ఆయిల్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో ఏది ఉత్తమమైనది ఎంచుకునే దగ్గరే అసలు రహస్యం దాగి ఉంది. ఈ రోజుల్లో చాలామంది కొబ్బరినూనెను వాడుతున్నారు. దానికి కారణం కొబ్బరినూనెలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఇది ట్రెండీ సూపర్ ఫుడ్ గా కూడా మనకు ఉపయోగపడుతుంది.
ఈ నూనె వల్ల శరీరంలో కొవ్వు నిల్వ చేయబడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనంలో కూడా వెళ్లడైంది. అయితే ఏ రకమైన నూనెను వంటకు వినియోగించాలనేది చాలా మందిని తోలుస్తున్న ప్రశ్న. ముఖ్యంగా జపానీలు మాత్రము సురక్షతిమైన వంట నూనెనే వాడుతుంటారు. ముఖ్యంగా రాప్ సీడ్ ఆయిల్ ను వాడుతుంటారు. ఈ నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని వారు భావిస్తారు. ఈ నూనెలో ఫ్యాటీ ఆసిడ్స్ చాలా బ్యాలెన్స్ గా ఉండడమే కారణం. వారు తీసుకునే ఆహారంలో నూనెను ప్రధానంగా చెప్పవచ్చు.
అయితే ఈ నూనె తెల్లని ఆవాల గింజల మాదిరిగా ఉంటుంది. కాబట్టి దీనిని తెల్ల ఆవాల నూనె అని కూడా పిలుస్తారు.దీనిలో ఎరుసిక్ యాసిడ్ తక్కువ పరిమాణంలో ఉండడం వల్ల వ్యాధుల నుండి రక్షిస్తుంది. జపానీల ఆరోగ్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. అలాగే ఈ నూనెలో కొవ్వు నిర్మాణం కూడా శరీరానికి హాని కలిగించదు. ఇక మిగతా నూనెలతో పోలిస్తే ఈ నూనెలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. వేడి చేయడానికి నిరోధకతను ఈ నూనె కలిగి ఉంటుంది. కాబట్టి జపానీయుల ఆయుష్షును పెంచే ప్రధమ ఔషధంగా ఈ నూనెను చెప్పవచ్చు.