Varalakshmi Sarath Kumar Missed the Role in Salaar : సలార్ సినిమా భారీ కలెక్షన్లతో ఎలా దూసుకుపోతుందో తెలిసిందే. ప్రేక్షకుల్లో ఎన్నో హోప్స్ క్రియేట్ చేసి రిలీజ్ అయిన సలార్ ఇప్పుడు భారీ అంచనాలను కూడా క్రాస్ చేసింది. ఈ వసూళ్ల వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడంతో, ఆ సినిమాలో నటించే ఛాన్స్ మిస్సయిన ఒక యాక్టర్ న్యూస్ ఇప్పుడు నెట్ ఇంట్లో హల్చల్ చేస్తుంది. ఆ యాక్టర్ ఎవరు దానికి సంబంధించిన న్యూస్ ఏంటో తెలుసుకుందాం..
సలార్ లో శ్రియ రెడ్డి పాత్ర చాలా హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే రాధా రామ అనే క్యారెక్టర్ నీ శ్రియా రెడ్డి చేసింది. శ్రీయా రెడ్డి మొదటగా వీడియో జాకీగా, ఆ తర్వాత టెలివిజన్ ప్రజెంటర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్ర పోషించి, ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది.
అయితే నిజానికి ఈ యాంటీ రోల్ మొదటగా శ్రీయ రెడ్డి దగ్గరికి వెళ్లలేదు. ఈ పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ కూతురైతే బాగుంటుందని ప్రశాంత్ నీల్ ఆలోచించారంట. ఆ అవకాశాన్ని వరలక్ష్మి శరత్ కుమార్ కి ఇవ్వాలని ప్రశాంత్ నీల్ భావించారంట. కానీ వరలక్ష్మి మాత్రం అవకాశాన్ని చేతులారా పాడుచేస్తుందని తెలుస్తుంది.

ప్రభాస్ లాంటి పెద్ద హీరో సినిమాలో నటిస్తే తనకు గుర్తింపు ఉండదని, అలాగే అంత పెద్ద మూవీలో ఇలాంటి క్యారెక్టర్ నీ ఎవరూ పట్టించుకోరని తను భావించినట్టు తెలుస్తుంది. అందుకే ఆ పాత్రను రిజెక్ట్ చేసిందంట. కానీ ఇప్పుడు తను చేసిన తప్పుకు చాలా పశ్చాతాపం పడుతుంది. ఎందుకంటే సలార్ సినిమాలో ప్రభాస్ ఒక్కడికే పేరు రాలేదు.
అందులో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు, పేరు లభించింది. ఒక్కసారిగా వారి జాతకం మారిపోయింది అని చెప్పవచ్చు. ప్రేక్షకులు అంతలా ఒక్కో పాత్రకి కనెక్ట్ అయిపోయారు. జగపతిబాబు, పృధ్విరాజ్ లాంటివాళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేసి మంచి పేరును పొందుతున్నారు. పాపం వరలక్ష్మి మాత్రం చేసిన తప్పుకు చాలా పశ్చాతాపం పడుతుందట.
పాత్రల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకొని, ప్రేక్షకులకు దగ్గరైన వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత పెద్ద స్టార్ హీరో పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న సినిమాను రిజెక్ట్ చేసి, చాలా పెద్ద తప్పు చేసిందని, ఇక మీదట తను చేయబోయే క్యారెక్టర్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
