మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోలు వ్యక్తిత్వంలో నడవడిక లో ఎంతో హుందాగా ఉంటారు. నటన పరంగానే కాకుండా తమ ప్రవర్తన ద్వారా కూడా ప్రేక్షకుల హృదయాల్లో మంచి మార్కులు సంపాదించుకుంటారు. తాజాగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
తను పని చేసిన దర్శకులు అందరూ తనకు ఉపాధ్యాయులే అని, ప్రతి ఒక్కరు నుండి తాను ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నానని, అందుకే వారే నాకు గురువులని తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఇలా ఉంది..
నటుడిగా నా ప్రయాణంలో…
నా దర్శకులు ఎప్పుడూ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులే. మీరు నాపై చూపిన ప్రభావం కేవలం ఒక సినిమాతో నేను మరచిపోయే విషయం కాదు, ఎప్పుడూ ఎంతో నేర్చుకునే విషయాలే తెలుసుకున్నాను. మీ నుండి నేర్చుకున్న విషయాలకు ధన్యవాదాలు..
హ్యాపీ టీచర్స్ డే..
శ్రీకాంత్ అడ్డాల, క్రిష్ జాగర్లమూడి, పూరిజగన్నాధ్, శ్రీను వైట్ల, శేఖర్ కమ్ముల, సంకల్ప రెడ్డి, వెంకీ అట్లూరి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి మీరందరూ నా గురువులే అంటూ వారిని గౌరవిస్తూ ట్వీట్ చేశారు.My directors have always been the most influential people in my journey as an actor.
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) September 5, 2020
The impact you guys have had on me is not something I’ll forget with just one movie, but something I’ll always cherish and learn from.
Thank you for everything!🤗#HappyTeachersDay pic.twitter.com/8h8T9j4ShF