Remuneration of Vijay Dalapati : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక హార్ట్ టాపిక్ రన్ అవుతుంది. అది హీరోల రెమ్యునరేషన్. సినీ ఇండస్ట్రీలో హీరోల రెమ్యూనరేషన్ అంటే అందరూ చాలా ఆసక్తిగా ఉంటారు. ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో అనేది తెలుసుకోవడానికి తహతహలాడుతారు. అయితే ఇప్పటివరకు ఒక్కో హీరో వంద నుండి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
మరోరకంగా చూసుకుంటే సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో దూసుకు వెళ్తున్నాయి. వాటి కలెక్షన్లు మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీగానే ఉన్నాయి. ఏకంగా 1000 కోట్లకు పైగా వసూల్లను రాబడుతూ, రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాయంటే, సినీ పరిశ్రమ ఎంతలా మార్పు చెందిందో మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఏడాది భారీ చిత్రాలు మంచి కలెక్షన్స్ రాబట్టయి అనే సంగతి మనందరికీ తెలిసిందే.
అంతేకాకుండా స్టార్ హీరోస్ అయినటువంటి షారుక్, ప్రభాస్, సల్మాన్, విజయ్ సేతుపతి, చిరంజీవి, బాలకృష్ణ ఖాతాలో కూడా ఈ సూపర్ హిట్స్ చేరాయి. కానీ ఒక్క హీరో మాత్రం వీళ్ళ అందరిని బీట్ చేస్తూ ఏకంగా ఈ సంవత్సరానికి గాను వెయ్యి కోట్లు సంపాదించి అతిపెద్ద రికార్డును సాధించాడు. ఆ హీరో ఎవరు వెంటనే తెలుసుకుందాం…
ఆ మెస్మరైజింగ్ హీరో మరెవరో కాదు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. తమిళంలో సూపర్ స్టార్ హీరోగా ఈయనకు మంచి పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి. అతడికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇటీవలే లియోతో హిట్ అందుకున్న విజయ్ ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తలపతి 68 లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
వచ్చే ఏడాది జూన్ లో ఈ సినిమా మన ముందుకు రానుంది. అయితే విజయ్ 200 కోట్ల పారితోషం అందుకోన్నట్లు తెలుస్తుంది. విజయ్ సినిమాలు ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఆయనతో షూటింగ్ చేసిన నిర్మాతలకు భారీ లాభాలను కూడా తెచ్చి పెడుతున్నాయి. అందుకోసం ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగా పెరుగుతుందని వినికిడి.ఈ ఏడాది రెండు సినిమాల్లో నటించాడు.
సంక్రాంతి పండుగ సందర్భంగా విజయ నటించిన వారసుడు విడుదల కాగా, లియో అక్టోబర్ లో విడుదలైంది. ఆ తర్వాత ఎంతో ఆసక్తిగా అందరు ఎదురుచూసిటువంటి లోకేష్ కనక రాజన్, విజయ కాంబినేషన్ లో వచ్చిన లియో కూడా 650 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక మొత్తంగా ఈ సంవత్సరం దళపతి విజయ్ తన చిత్రాల ద్వారా, తమిళ చిత్ర సీమలో దాదాపు 1000 కోట్ల ఆదాయాన్ని సంపాదించాడు.
ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత ధనుంజయ వెల్లడించారు.తమిళ ఇండ్రస్టీ 3500 కోట్లు రాబట్టిందని, ఈ ఆదాయంలో దాదాపు 1000 కోట్ల తో విజయ దళపతి అగ్రగామిలో నిలిచారని ఆయన తెలిపారు.