Shivatmika Latest Photo Pics : రాజశేఖర్, జీవితల కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శివాత్మిక రాజశేఖర్. ఈ ముద్దుగుమ్మ కోటబొమ్మాలి సినిమాతో మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఈ అమ్మడు మొదటిగా అహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ తో పరిచయమైంది. ఆ సిరీస్ కూడా మంచి టాక్ ని తెచ్చుకుంది. ఆ తర్వాత అద్భుతం సినిమాతో మూవీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

ఈ అమ్మడు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఉప్పెన సినిమాలో మొదటిగా తననే హీరోయిన్ గా అడిగారని కాకపోతే తనకు చెప్పిన స్టోరీ లైన్ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశానని, ఆ సినిమా వచ్చిన తర్వాత స్టోరీని మార్చి తీశారని చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత చేసిన కోటబొమ్మాలి పిఎస్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఒక్కసారిగా శివాత్మిక ఇమేజ్ ని పెంచేసింది. ఇక హాట్ షూట్స్ కి, ఫొటోస్ కి దూరంగా ఉండే శివాత్మిక సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ ని అప్లోడ్ చేసింది. చీరకట్టులో ఉన్నటువంటి ఆ ఫోటోస్ తో ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తుంది.
