Interesting Update from Eagle Movie : మాస్ మహారాజా రవితేజ నుండి మరో చిత్రం మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ సినిమా తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి మన ముందుకు రావడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేసుకుంటుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఆ ఫొటోస్ చాలా వైరల్ కూడా అయ్యాయి. రవితేజ లాంగ్ హెయిర్ తో, గడ్డంతో, లుంగీతో ఉండడంతో మంచి మాస్ లుక్ లో చాలా అట్రాక్టివ్ గా కనిపించాడు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. చిత్ర బృందం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. కార్తీక్ ఘట్టమనేని ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. సినిమా కథను ట్రైలర్‌లో చూపించాం. అప్పటినుంచి ఈగల్ సీరియస్ సినిమా అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ ఈగల్ లో రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా వినోదంతో కూడుకొని ఉంటుంది.
ఫైనల్ గా ఈగల్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని ఆయన చెప్పారు. జోనర్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు కచ్చితంగా చూస్తారు. చాలా గ్యాప్ తర్వాత రవితేజ వయసుకు తగ్గ పాత్రను చేస్తున్నాడు అని చెప్పవచ్చు. మేకప్ లేకుండా రవితేజ ఈ సినిమాలో నటించారు. విభిన్న పాత్రల్లో ఆయనను చూస్తారని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు ఏంటి కామెడీ సినిమానా.. ట్రైలర్ చూసి సీరియస్ అనుకున్నామే అని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు.